శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జనవరి 2020 (09:33 IST)

బన్నీ ఓ కదిలే విద్యుత్ తీగ : సీతారామశాస్త్రి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం అల.. వైకుంఠపురములో... ఈ చిత్రం ప్రిరిలీజ్ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా సీతారామశాస్త్రి మాట్లాడారు. ముఖ్యంగా, హీరో అల్లు అర్జున్ గురించి చెబుతూ, బన్నీ అంటేనే తనకు వివశత్వం వస్తుందని, ఒళ్లు మర్చిపోతానని చెప్పుకొచ్చారు.
 
ఇదే విషయాన్ని బన్నీ తండ్రి అల్లు అరవింద్‌కు చెప్పానని గుర్తుచేశారు. పైగా, "మీ వాడ్ని కుదురుగా ఓ చోట నిలబడమని చెప్పండి పాట రాస్తాను అన్నాను. ఎందుకంటే బన్నీ ఓ కదిలే విద్యుత్ తీగ. అతడలా మెరుపులా నర్తిస్తూ ఉంటే నేను కళ్లుచెదిరేలా చూస్తుంటాను తప్ప ఏం పాట రాయగలను?" అని చెప్పాను. 
 
బన్నీ సినిమాలు టీవీలో చూస్తుంటాను. అతడిలో ఉన్న సంస్కారం నాకిష్టం. నా బావ అల్లు అరవింద్ పిల్లలందరూ ఎంతో వినయశీలులు. వారి ప్రవర్తన చాలా బాగుంటుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు, తనతో పాటు ఈ సినిమాలో పాటలు రాసిన ఇతర గీతరచయితలను ఎంతో సహృదయతతో పేరుపేరునా అభినందించారు