శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (17:53 IST)

ఆసుప‌త్రిలో చేరిన బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్.. ఏమైంది..?

Alia Bhatt
బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్‌.. ఆదివారంనాడు ముంబైలోని ఓ ఆసుప‌త్రిలో జాయిన్ అయ్యారు. అక్క‌డ సాయంత్రం వ‌ర‌కు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాక‌.. ఆసుప‌త్రి నుంచి డాక్ట‌ర్లు పంపించివేశారు.. షూటింగ్ బిజీ వ‌ల్ల ఆమె ఒత్తిడికి గుర‌యింద‌నీ.. ఆమెకు ఎటువంటి అనారోగ్యాలు లేవ‌ని తేల్చి చెబుతున్నారు.. కాగా.. ఆలియా భ‌ట్ తాజాగా సంజ‌య్‌లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్న `గంగూబాయి కతియావాడీ` చిత్రంలో న‌టిస్తోంది.
 
గంగూబాయ్‌.. కామ‌టిపురాలోని ఒక వేశ్యా గృహాన్ని న‌డిపే మేడ‌మ్‌.. ఆమె పాత్ర‌ను ఆలియా పోషిస్తోంది. ఈ చిత్రం అన్నీ స‌వ్యంగా వుంటే ఈ ఏడాదికి రిలీజ్ కావాల్సింది. కానీ క‌రోనా వ‌ల్ల షూటింగ్ వాయిదా ప‌డింది. ముంబై మీడియా క‌థ‌నం ప్ర‌కారం.. డిసెంబ‌ర్ 2020న ఆమె తిరిగి షూటింగ్‌కు హాజ‌ర‌యింది. కొద్దిరోజులు షూటింగ్ స‌జావుగా జ‌రిగింది. 
 
అయితే ఆదివారంనాడు అంటే జ‌న‌వ‌రి 17న ఆమె ఒక్క‌సారిగా నీర‌సంగా వుండ‌డంతో ముంబైలోని ఓ ఆసుప్ర‌తిలో జాయిన్ అయింద‌ట‌. అనంత‌రం అక్క‌డ ట్రీట్‌మెంట్ పూర్త‌య్యాక‌.. వెంట‌నే మ‌రురోజు అన‌గా సోమ‌వారం 18వ తేదీన సెట్‌లోకి ప్ర‌వేశించింది. ఇమ్రాన్ హ‌మ్మీ, అజ‌య్‌, శంత‌ను మ‌హేశ్వ‌రి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుద‌ల కానుంది.