VijayDeverakonda v10: లైగర్‌గా వచ్చేస్తున్నాడు.
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ఓ పవర్‌ఫుల్ యాక్షన్, లవ్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. అంతేకాకుండా ఫస్ట్‌లుక్‌ను సైతం అభిమానులతో పంచుకుంది.
బాక్సింగ్ ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో విజయ్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. విజయ్‌కు జంటగా బాలీవుడ్ నటి అనన్య పాండే ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
తాజాగా చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. లయన్, టైగర్‌ల క్రాస్ బ్రీడ్ లైగర్ అంటూ చిత్ర టైటిల్ అనౌన్స్ చేసిన మేకర్స్ ఫస్ట్ లుక్‌లో విజయ్ దేవరకొండని సరికొత్తగా చూపించారు. ఈ పోస్టర్ సినిమాపై భారీ ఆసక్తిని కలిగిస్తుంది. కరోనా వలన ఆగిన చిత్ర షూటింగ్ మళ్ళీ మొదలైంది.
ఇదిలా వుంటే.. వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ కావడంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసి మీదున్నాడు రౌడీ. అందుకే మళ్లీ పూర్తిస్థాయిలో ప్రేమ కథల జోలికి వెళ్లకుండా కొంత వినూత్నంగా లైగర్‌తో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ కథను ఎంచుకున్నాడు. దీని తర్వాత నిన్ను కోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వేసవిలో ప్రారంభం కానుంది.
ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో మరో చిత్రం చేయనున్నాడు. 2022లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని గతంలోనే ప్రకటించారు. ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని టాక్. అంటే ఇందులో విజయ్ సైనికుడిగా కనిపించనున్నాడన్నమాట.