ఎఫ్3 షూటింగ్ ముగిసిందా..? ఫన్‌కి సెలవులు ఉండవు..

F3
సెల్వి| Last Updated: సోమవారం, 18 జనవరి 2021 (09:52 IST)
F3
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి చేస్తున్న సినిమా ఎఫ్3 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన ఎఫ్2కు సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు కథను లాక్‌డౌన్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపుడి సిద్ధం చేశాడు. ఎఫ్2ను డైరెక్ట్ చేసిన అనిల్ ఎఫ్3ని కూడా డైరెక్ట్ చేయనున్నారు.

దాదాపు ఎఫ్2కు పనిచేసిన వారే మరోసారి జతకట్టి ఎఫ్3ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి కొత్త అప్‌డేట్ ఇచ్చాడు దర్శకుడు అనిల్. ఈ సినిమాను కుదిరినంత త్వరగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రీకరణను శరవేగంతో పూర్తి చేస్తున్నామని, చివరికీ వారంతాల్లో కూడా సెలవులే తీసుకోకుండా చేస్తున్నామన్నాడు.

అంతేకాకుండా ఫన్‌కి సెలవులు ఉండవంటూ ఎఫ్3 సెట్స్‌ నుంచి ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలో హీరో వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపుడి, నిర్మాత దిల్ రాజు, సునీల్ కలిసిన కూర్చుని ఉన్నారు. ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ చాలా కొత్త తరహాలో ఉండబోతుందని, దీనిని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.దీనిపై మరింత చదవండి :