శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By vasu
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2017 (12:31 IST)

ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చిన బన్నీ.. దాసరి అంత్యక్రియల్లో కూడా డీజే డీజే అంటూ గోల

హీరోయిన్‌ల పేర్లతో గుళ్లు కట్టినా, హీరోల పేరిట కొట్టుకు చచ్చినా.. అంత వెర్రెత్తిపోయే అభిమానం కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం అనుకునే వారు కానీ.. ప్రస్తుతం అటువంటి పరిమితులు చెరిపేయబడ్డాయని నిరూపిస్తు

హీరోయిన్‌ల పేర్లతో గుళ్లు కట్టినా, హీరోల పేరిట కొట్టుకు చచ్చినా.. అంత వెర్రెత్తిపోయే అభిమానం కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం అనుకునే వారు కానీ.. ప్రస్తుతం అటువంటి పరిమితులు చెరిపేయబడ్డాయని నిరూపిస్తున్నాయి తాజా సంఘటనలు.
 
అభిమానులు హీరోలతో ఫోటోలు తీసుకోవడం, వారి ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడం పరిపాటిగా మారిపోయిన ఈ సెల్ఫీల కాలంలో చివరికి దాసరి అంత్యక్రియల సమయంలో కూడా ఏ మాత్రం సంయమనం పాటించకుండా అల్లు అర్జున్ అభిమానులు "డీజే డీజే" అంటు కేకలు పెట్టడం.. అటు అల్లు అర్జున్‌కే కాకుండా చాలా మందికి ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. 
 
ఈ తాజా సంఘటనపై కేకలు పెట్టవద్దని అల్లు అర్జున్ కోప్పడే వరకు వెళ్లిందంటే ఆ అభిమానం ఎంత ఇబ్బందికరంగా మారిందేమో ఆలోచించవచ్చు. అభిమానం ఎటువంటి పరిస్థితులలోనూ హద్దులు దాటరాదనే విషయాన్ని కనీసం ఇకనైనా సదరు అభిమానులు గుర్తు పెట్టుకుంటే బాగుంటుందేమో..