బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (20:56 IST)

జానీ మాస్టర్ ఇష్యూతో బన్నీకి, సుక్కూకు సంబంధం లేదు.. రవి

Johnny Master
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై 21 ఏళ్ల అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన తీవ్రమైన వేధింపుల కేసుతో వివాదం సంచలనంగా మారింది. ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుండి అనేక సంవత్సరాలపాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. జానీ మాస్టర్‌ను పోక్సో చట్టం కింద అరెస్టు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య అయేషా నటుడు అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఇందుకు కారణమని ఆరోపించారు. వారు సదరు మహిళకు మద్దతు ఇస్తున్నారని, జానీ కెరీర్‌కు హాని కలిగించడానికి ఇదంతా చేశారని ఆరోపించారు. 
 
అయితే ఈ ఆరోపణలను పుష్ప 2 నిర్మాత రవి యెర్నేని తీవ్రంగా ఖండించారు. జానీ మాస్టర్,  అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మధ్య సమస్య వ్యక్తిగత విషయమని.. పుష్ప 2 తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. 
 
అల్లు అర్జున్‌, సుకుమార్‌లను వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించడంపై నిర్మాత రవి యెర్నేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ కేసుకు ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదని అన్నారు.