బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (18:28 IST)

యూట్యూబ్‌ ఛానల్‌ ఆఫీసుపై బన్నీ ఫ్యాన్స్ దాడి.. ఎందుకంటే?

allu arjun
హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలోని యూట్యూబ్‌ ఛానల్‌ కార్యాలయంపై సోమవారం అల్లు అర్జున్‌ అభిమానులు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆవేశంతో బన్నీ ఫ్యాన్స్ కంప్యూటర్లు, ఇతర కార్యాలయ సామగ్రిని ధ్వంసం చేశారు. 
 
అల్లు అర్జున్‌కు నెగటివ్‌గా చిత్రాలను పదేపదే పోస్ట్ చేయడం వల్ల ఈ దాడి జరిగింది. కానీ దాడికి ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉన్నప్పటికీ, ఈ అల్లు అర్జున్ చుట్టూ కొనసాగుతున్న వివాదాలతో ముడిపడిపోయింది. 
 
సదరు యూట్యూబ్ ఛానల్‌లో బన్నీపై చేసిన థంబ్ నెయిల్స్‌ను కూడా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. "ఆసుపత్రిలో అల్లు అర్జున్.. షాక్‌లో సినీ ప్రముఖులు" అంటూ థంబ్ నెయిల్ క్రియేట్ చేసి.. బన్నీ ఫేసును మార్ఫింగ్ చేసి మరీ వీడియోలు పోస్ట్ చేసినందుకే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 
 
అంతేకాకుండా బన్నీపై పోస్ట్ చేసిన వీడియోలను వారి చేతే డిలీట్ చేయించి బహిరంగ క్షమాపణలు కూడా చెప్పించారు ఫ్యాన్స్. ఇంకోసారి ఇలా రిపీట్ అయితే ఆఫీసే ఉండదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇప్పటికే తన సన్నిహితుడు, స్నేహితుడు, వైకాపా అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ఇచ్చినందుకు... బన్నీ మెగా ఫ్యాన్స్ నుంచి.. ఫ్యామిలీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.