ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (16:56 IST)

స్నేహారెడ్డి లేటెస్ట్ లుక్స్ అదుర్స్.. దేవతలా మెరిసిపోయింది..

Sneha reddy
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి లేటెస్ట్ లుక్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఫోటోలు ఫ్యాషనర్ల  హృదయాలను గెలుచుకున్నాయి. స్నేహారెడ్డి విజయవంతమైన వ్యాపారవేత్త అయిన సంగతి తెలిసిందే. తాజాగా స్నేహారెడ్డి 'పిక్-అబూ' ఈవెంట్ ప్లానర్స్ వ్యాపారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 
 
స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫోటోలను, అద్భుతమైన క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వుంటారు. స్నేహారెడ్డి తన ఇటీవలి ఫోటోషూట్ నుండి కొన్ని చిత్రాలను షేర్ చేసుకుంది. ఈ ఫోటోల్లో ఆమె చీరకట్టు అదిరిపోయింది. చీరలో చాలా అందంగా కనిపించింది. 
 
ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరైన స్నేహారెడ్డి తన చీరను డిజైన్ చేసింది. ఈ చీర ధర రూ. 1.29 లక్షలు అని తేలింది. ప్రస్తుతం ఈ చీరకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.