శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (21:37 IST)

దర్శకరత్న దాస‌రికి అల్లూ రామ‌లింగ‌య్య జాతీయ అవార్డు...

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు టాలీవుడ్‌కి చేసిన సేవ‌లు అస‌మానం. ద‌శాబ్ధాలుగా ప‌రిశ్ర‌మ‌కు పెద్ద దిక్కుగా నిలిచారు. దాదాపు 150 పైగా సినిమాల‌కు ప‌నిచేసిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. ప‌రిశ్ర‌మ‌లో ఏ స‌మ‌స్య వ‌చ

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు టాలీవుడ్‌కి చేసిన సేవ‌లు అస‌మానం. ద‌శాబ్ధాలుగా ప‌రిశ్ర‌మ‌కు పెద్ద దిక్కుగా నిలిచారు. దాదాపు 150 పైగా సినిమాల‌కు ప‌నిచేసిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. ప‌రిశ్ర‌మ‌లో ఏ స‌మ‌స్య వ‌చ్చినా అంద‌రికీ నేనున్నానంటూ ముందుకొచ్చే గొప్ప మ‌నిషి దాస‌రి. చిన్న నిర్మాత‌ల‌కు దైవం అత‌డు. ఓవైపు సినిమా, మ‌రోవైపు టీవీ సీరియ‌ళ్ల ప్రొడ‌క్ష‌న్‌లోనూ దాస‌రి త‌న‌దైన శైలిలో దూసుకుపోయారు. 
 
ఇప్ప‌టికీ వంద‌ల కోట్ల ప‌రిశ్ర‌మ‌లో నేను సైతం అంటూ క‌దం తొక్కుతున్నారు. అయితే ఇటీవ‌లే దాస‌రి మ‌ల్టిపుల్ ఆర్గాన్ డిజార్డ‌ర్ వ‌ల్ల ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. త్వ‌ర‌లోనే ఇంటికి డిశ్చార్జ్ కానున్నారు. ఈలోగానే దాస‌రికి ఓ శుభ‌వార్త. ప్ర‌తిష్ఠాత్మ‌క అల్లు రామ‌లింగ‌య్య జాతీయ‌ పుర‌స్కారం-2016కి దాస‌రిని ఎంపిక చేసిన‌ట్టు అల్లు రామ‌లింగ‌య్య క‌ళాపీఠం ప్ర‌క‌టించింది.
 
గురువారం సాయంత్రం హైద‌రాబాద్ ర‌వీంద్ర‌భార‌తిలో ఈ పుర‌స్కారాన్ని అంద‌జేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా, చ‌ర‌ణ్‌, బ‌న్ని ఆత్మీయ అతిథులుగా హాజ‌రుకానున్నారు. ఏపీ మంత్రులు గంటా శ్రీ‌నివాస‌రావు, కామినేని వంటి రాజ‌కీయ ప్ర‌ముఖులు కార్య‌క్ర‌మానికి హాజరుకానున్నారు.