సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (14:08 IST)

29 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లుడా మజాకా అనుభవాలు

chiru Trackter sean
chiru Trackter sean
కథానాయకుడు చిరంజీవి నటించిన అల్లుడా మజాకా చిత్రం నేటికి విడుదలై 29 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరు ఫ్యాన్స్ ట్వీట్ చేశారు. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో 1995 లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి, రమ్యకృష్ణ, రంభ, ఊహ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై దేవివరప్రసాద్ నిర్మించాడు. కోటి సంగీత దర్శకత్వం వహించాడు. పోసాని కృష్ణమురళి చిత్రానువాదం సమకూర్చాడు.
 
daining hall sean
daining hall sean
కాగా, ఈ సినిమాలో ట్రాక్టర్ ను చిరంజీవి తోలే సన్నివేశంలో కెమెరా యాంగిల్స్ ఎక్కడా పెట్టామో  తెలియజేస్తూ, ఇ .వి.వి. ట్రాక్టర్ పైకి ఎక్కి కెమెరా యాంగిల్ షూట్ చేయడం, పక్కనే తోటి టెక్నీషియన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వంటి ఫొటోలు రిలీజ్ చేశారు.
 
అదేవిధంగా భోజనం చేసే సీన్ లో సన్నివేశాలు కూడా ఎలా జరుగుతాయో చూపించాడు. ఒక సన్నివేశాలు ఐదారుగురు వుంటే వారంతా కలిసి ఆ సన్నివేశాన్ని ఎలా ఆకలింపు చేసుకంటారనేది కూడా పాత జ్నాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పట్లో ఈ సినిమాలో ద్వంద సంభాషణలు వున్నందున రెండు సార్లు సెన్సార్ జరగాల్సి వచ్చింది.