శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (17:09 IST)

గేమ్ ఛేంజర్ షూట్ లో రామ్ చరణ్ ఈరోజు పాల్గొన్నాడు

Ramcharan
Ramcharan
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ చిత్రం రూపొందుతోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షెడ్యూల్ షెడ్యూల్ కు గేప్ తీసుకుంటుంది. దాదాపు మూడు వంతుల పార్ట్ పూర్తయిందని తెలుస్తోంది. అయితే మెగా హీరోలు ఎవరైనా కనబడితే ఫ్యాన్స్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాల గురించే అడుతుంటారు. అదే రూటులో ఈరోజు  ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా వరుణ్ తేజ్ ఫ్యాన్స్ నుంచే ప్రశ్న ఎదురైంది.
 
దీనికి వరుణ్ సమాధానమిస్తూ, తాను కూడా గేమ్ చేంజర్ అప్డేట్ కోసం చరణ్ ను అడుగుతూ ఉంటానని, ఇవాళే షూటింగ్ స్టార్ట్ అయ్యినట్టు ఉంది. ఇవాళ ఉదయమే కాల్ కూడా మాట్లాడానని అతి త్వరలోనే గేమ్ చేంజర్ అప్డేట్స్ వరుసగా వస్తాయని అనుకుంటున్నాను అని వరుణ్ తేజ్ తెలిపారు. 
 
ఇదిలా వుండగా, ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ చూశాక రామ్ చరణ్ అద్భుతం అంటూ తెలియజేయడంతో, థ్యాంక్ యూ అన్న.. అంటూ సింపుల్ గా వరుణ్ బదులిచ్చాడు.