బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (12:56 IST)

రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ : బోనీ కపూర్ వెల్లడి

jhanvi kapoor
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించే తన 16వ చిత్రంలో దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించనున్నారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ వెల్లడించారు. నిజానికి ఆర్సీ16 చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారనే వార్త గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుంది. అయితే, చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలో నిర్మాత బోనీ కపూర్ ఇటీవల ఓ చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొని ఈ పుకార్లకు ఓ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే తన కుమార్తె జాన్వీ.. చెర్రీ సరసన నటించబోతున్నట్టు, ఇదంతా అమ్మవారి ఆశీర్వాదమేనని చెప్పుకొచ్చారు. 
 
ఒకప్పుడు 'శ్రీదేవి జగదేకవీరుడు అతిలోకసుందరి' వంటి ఇండస్ట్రీ హిట్స్‌లో చిరంజీవితో భాగం పంచుకుంటే ఇప్పుడు ఆమె తనయ రామ్ చరణ్‌తో జోడి కట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ "దేవర"తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ వెంటనే చరణ్‌‌తో జోడి కట్టే అవకాశం రావడం మంచి విషయమే. మంచి సినిమాలు చేసినా, బాలీవుడ్‌లో జాన్వీకి టాలెంట్‌కు తగ్గ పేరు రాలేదు. స్టార్స్ సరసన అవకాశాలు రాలేదు. ఇప్పుడు తెలుగులో తారక్, చరణ్‌ల సరసన ఒకేసారి చాన్స్‌లు కొట్టేసింది. త్వరలో హైదరాబాద్‌లో ఇల్లు కూడా తీసుకొబోతుందట‌. మొత్తానికి టాలీవుడ్‌లో సెటిల్ అవ్వటానికి జాన్వీ ఫిక్స్ అయినట్టు ఉంది.