బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (14:02 IST)

క్లీం కారకు చెల్లెళ్లు పుట్టారు... గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన

Ram Charan
Ram Charan
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య, ఉపాసన కామినేని కొణిదెల, ఈరోజు తన ఫాలోవర్స్‌ను హృదయపూర్వక పోస్ట్‌తో ఆనందపరిచారు. తన చెల్లెలు అనుష్ పాల- ఆమె భర్త అర్మాన్ ఇబ్రహీం కవల కుమార్తెలతో ఆశీర్వదించబడ్డారనే సంతోషకరమైన వార్తను ఆమె పంచుకున్నారు. 
 
ఇంకా కుటుంబంతో గల ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఇందులో రామ్ చరణ్ మెగా ప్రిన్స్ క్లిన్ కారాను ఎత్తుకుని కనిపించాడు. పక్కనే ఉపాసన వున్నారు. వారితో పాటు ట్విన్ తల్లిదండ్రులు, అనూష్ పాల, అర్మాన్ ఇబ్రహీం, వారి కుమార్తెలు కనిపించారు. 
 
ఇక ఇన్ స్టా క్యాప్షన్‌లో, ఉపాసన నవజాత శిశువులను "అద్భుతమైన త్రీసమ్ - పవర్ పఫ్ గర్ల్స్"గా పరిచయం చేసింది.