''దేవర'' జాన్వీ కపూర్‌కు పోటీగా మరాఠీ ముద్దుగుమ్మ.. ఎవరు?  
                                       
                  
                  				  జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం దేవర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. "జనతా గ్యారేజ్" విజయం తర్వాత దర్శకుడు కొరటాల శివతో కలిసి దేవర చేస్తున్నాడు యంగ్ టైగర్. ఇందులో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 
 				  											
																													
									  
	 
	ఇంకా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగులో అరంగేట్రం చేయనుంది. తాజాగా ఈ స్టోరీ ప్రకారం రెండో హీరోయిన్ కూడా వున్నట్లు తెలిసింది. 
				  
	 
	ఇప్పటికే రెండో హీరోయిన్‌గా మరాఠీ నటి శ్రుతి మరాఠే ఎంపికైంది. ఈమెకు కూడా ఇదే తొలి తెలుగు సినిమా కానుంది. త్వరలోనే ఈమె షూటింగ్‌లో జాయిన్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.