శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (20:16 IST)

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ నాన్ వెజ్ థాలీ.. చనిపోయిన బొద్దింకను చూసి?

Cockroach
Cockroach
జబల్‌పూర్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. సదరు ప్రయాణికుడు తన ఆహారంలో చనిపోయిన బొద్దింకను చూసి షాకయ్యాడు. ఆహారంలో బొద్దింకను చూసి చాలా బాధపడ్డానని సోషల్ మీడియాలో తెలిపాడు. ఇంకా ఆహారంలో బొద్దింక గల ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 
 
జబల్‌పూర్ రైలు స్టేషన్‌లో దిగిన తర్వాత అతను పశ్చిమ మధ్య రైల్వేకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి రెండు రోజుల తర్వాత ఎక్స్‌లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను షేర్ చేశాడు. ఈ ట్వీట్‌కు ప్రతిస్పందనగా, ఐఆర్‌సీటీసీ క్షమాపణలు కోరింది. 
 
"నేను 1/02/2024 రైలు నెం. 20173 ఆర్కేఎంపీ నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాను. వారు ఇచ్చిన ఆహార ప్యాకెట్‌లో చనిపోయిన బొద్దింకను చూసి నేను బాధపడ్డాను" అని డాక్టర్ శుభేందు కేశరి ఎక్స్‌లో కొన్ని చిత్రాలను పంచుకుంటూ రాశారు.
 
అతను తన ఫిర్యాదులో సాక్షిగా రాజేష్ శ్రీవాస్తవ అనే మరో ప్రయాణికుడిని చేర్చుకున్నాడు. అతను ఆర్డర్ చేసిన నాన్ వెజిటేరియన్ థాలీలో చనిపోయిన బొద్దింక మిగిలిన ఫోటోలలో కనిపిస్తుంది. దీనిపై ఐఆర్టీటీసీ సానుకూలంగా స్పందించింది. ఇంకా క్యాటరింగ్ సర్వీస్ తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.