1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (12:12 IST)

విశ్వంభరలో త్రిషతో పాటు తమన్నా, శ్రీలీల, మీనాక్షి కూడా...

trisha
మెగాస్టార్ చిరంజీవి- మల్లిడి వశిష్ట కాంబోలో రూపొందుతున్న విశ్వంభర మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు నటించే అవకాశం వున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇందులో మెయిన్ హీరోయిన్‌గా ఒకరు.. మిగిలిన వాళ్లు కీలక పాత్రలు చేస్తారని టాక్ వస్తోంది. 
 
విశ్వంభరలో త్రిషతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటించబోతున్నారట. ఈ ముగ్గురితో చిరంజీవి మామూలు కాంబో సీన్స్ మాత్రమే ఉంటాయని సమాచారం. ఆ పాత్రల కోసం తమన్నా, శ్రీలీల, మీనాక్షి చౌదరిలను చిత్ర యూనిట్ ఫైనల్ చేసినట్లు తెలిసింది.
 
ఇకపోతే.. 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, రానా, శింబు తదితరులు విలన్‌గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల కానుంది.