బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (11:41 IST)

విశ్వంభర సెట్ కు ఫిబ్రవరిలో మెగాస్టార్ చిరంజీవి - 2025 సంక్రాంతికి విడుదల ఖరారు

viswmbhar latest poster
viswmbhar latest poster
మెగాస్టార్ చిరంజీవి మెగా ఫాంటసీ ఆడ్వెంచర్ 'విశ్వంభర'. ఇప్పటికే విడుదలైన ఈ మాగ్నమ్ ఓపస్ స్పెల్‌ బైండింగ్ గ్లింప్స్ గ్లోబల్ గా ట్రెండ్ అయ్యింది. మెగా మాస్ బియాండ్ యూనివర్స్ 'విశ్వంభర' కోసం మెగాస్టార్ చిరంజీవి జిమ్ లో కసరత్తులు చేస్తూ ప్రత్యేకంగా సిద్ధమౌతున్నారు. దీనికి సంబధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ లో వైరల్ అవుతోంది. వీడియో చివర్లో ''గెట్టింగ్ రెడీ ఫర్ విశ్వంభర' అని మెగాస్టార్ చెప్పడం అభిమానుల్లో  మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ నెల నుంచి 'విశ్వంభర' షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు మెగాస్టార్ చింజీవి.  
 
బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తునారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
 
కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్‌ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్లిరిక్ రైటర్స్.  శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా ఉన్నారు.
 2025 సంక్రాంతికి సినిమాను జనవరి 10న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.