శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (12:26 IST)

విశ్వంభర కోసం ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న చిరంజీవి

Chiranjeevi
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి తన కఠినమైన ఫిట్‌నెస్ నియమావళిని ప్రదర్శించే వీడియోతో అందరినీ షాక్‌కు గురిచేశారు. 67ఏళ్ల చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. ఇంకా తన తాజా సినిమా విశ్వంభర కోసం ఫిట్‌నెస్ ట్రైనింగ్ ప్రారంభించారు. తన శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఫిట్‌నెస్ స్పెషలిస్ట్ పర్యవేక్షణలో చిరంజీవి శిక్షణ పొందుతున్నారు.
 
సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిత్రీకరణలో పాల్గొనేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. గురువారం, చిరంజీవి ఫిట్ నెస్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు.

chiranjeevi
chiranjeevi