బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (10:54 IST)

టైమ్స్ స్క్వేర్‌లోని బిల్‌బోర్డ్‌పై పద్మవిభూషణ్‌ చిరంజీవి

Chiranjeevi
Chiranjeevi
జనవరి 25న, గణతంత్ర దినోత్సవానికి ముందు కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా టాలీవుడ్ మెగాస్టార్- చిరంజీవి సినీ ప్రపంచానికి చేసిన సేవలకుగాను పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చిరంజీవికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఈ క్రమంలో కుందవరపు శ్రీనివాస్ నాయుడు చిరు సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ స్టైలిష్‌గా నివాళులు అర్పిస్తూ తన అభిమానాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. అమెరికాలోని న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లోని బిల్‌బోర్డ్‌పై పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన విజువల్స్‌ను ఆయన షేర్ చేసుకున్నారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.