సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 7 ఫిబ్రవరి 2024 (18:35 IST)

వెంకటాచలంని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌- మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించిన టాటా ఏఐఏ

Venkatachalam
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జీవిత బీమా కంపెనీలలో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, IRDAI నుండి రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా వెంకటాచలం హెచ్‌ని నియమించినట్లు ఈరోజు వెల్లడించింది.  ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్-మేనేజింగ్ డైరెక్టర్, నవీన్ తహిల్యాని నుంచి వెంకటాచలం హెచ్ ఈ బాధ్యతలు స్వీకరించారు. టాటా గ్రూప్‌లో మరొక పాత్రకు నవీన్ మారటంతో పాటు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు.
 
అందరూ అభిమానంగా వెంకీ అని పిలిచే వెంకటాచలంకి లైఫ్ ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్‌మెంట్, కస్టోడియల్ సర్వీసెస్‌లో 27 సంవత్సరాల అనుభవం ఉంది. అతను సేల్స్ & డిస్ట్రిబ్యూషన్, స్ట్రాటజీ, బిజినెస్ అండ్ ప్రాసెస్ డెవలప్‌మెంట్ మరియు కీ అకౌంట్ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఆయన 2016లో టాటా ఏఐఏలో చేరారు. ఆయన ఈ బాధ్యతలు చేపట్టక మునుపు ప్రెసిడెంట్ మరియు చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్‌గా ఉన్నారు. మార్కెటింగ్, స్ట్రాటజీ, అనలిటిక్స్, డైరెక్ట్ డిజిటల్ బిజినెస్ వంటి రంగాలలో వెంకీ అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించారు.