గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (22:57 IST)

అత్యంత శక్తివంతమైన అప్‌గ్రేడ్‌ను పొందిన టాటా ఏఐఏ లైఫ్‌ ఫార్చ్యూన్‌ గ్యారెంటీ పెన్షన్‌

Cash
భారతదేశంలో సుప్రసిద్ధ జీవిత భీమా కంపెనీలలో ఒకటైన టాటా ఏఐఏలైఫ్‌ ఇన్సూరెన్స్‌ (టాటా  ఏఐఏ లైఫ్‌) తమ ప్రతిష్టాత్మకమైన యాన్యుటీ (గ్యారెంటీడ్‌ ఇన్‌కమ్‌ ఫర్‌ లైఫ్‌) ప్లాన్‌ కోసం అత్యంత శక్తివంతమైన  వెర్షన్‌ టాటా ఏఐఏ లైఫ్‌ ఫార్చ్యూన్‌ గ్యారెంటీ పెన్షన్‌ను విడుదల చేసింది. ఈ నూతన వెర్షన్‌లో అత్యంత కీలకమైన అంశాలను మెరుగు పరిచారు. వీటిలో అత్యధిక యాన్యుటీ రేట్లు, మరణ ప్రయోజనాలు వంటివి ఉండటం చేత వినియోగదారులు తమ గోల్డెన్‌ ఇయర్స్‌లో ఆర్ధికంగా స్వేచ్ఛను, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందగలరు.
 
జీవితకాలం పెరగడం, పొదుపు స్ధాయిలు తగ్గడం వల్ల దేశంలో రిటైర్‌మెంట్‌ ఆదాయం ఆందోళనగా మారింది. భారతదేశంలో రిటైర్‌మెంట్‌ పొదుపు అంతరాలు  2050 నాటికి 85 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. వినియోగదారులు ఖచ్చితంగా తమ రిటైర్‌మెంట్‌ తరువాత ఆర్థిక స్వేచ్ఛకు భరోసా కలిగి ఉండాలి. టాటా ఏఐఏ లైఫ్‌ ఫార్చ్యూన్‌ గ్యారెంటీ పెన్షన్‌ ప్లాన్‌, గ్యారెంటీడ్‌ ఇన్‌కమ్‌ అవకాశాలను అందించడంతో పాటుగా వినియోగదారులు తమ రిటైర్‌మెంట్‌ జీవితం కోసం తగినంతగా పొదుపు చేసుకునే అవకాశం అందిస్తుంది. భవిష్యత్‌ కోసం ప్రణాళికలు చేసుకునే వివాహితులు, మహిళలు, వ్యక్తులతో పాటుగా ఎస్‌ఎంఈ వినియోగదారులకు ఈ ప్లాన్‌ అత్యంత అనుకూలంగా ఉంటుంది.
 
టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ సమిత్‌ ఉపాధ్యాయ్‌ మాట్లాడుతూ, ‘‘ఒకరి జీవితంలో నూతన అధ్యాయానికి ఆరంభంగా రిటైర్‌మెంట్‌ నిలుస్తుంది. ప్రొఫెషనల్‌ బాధ్యతలను గురించి బాధపడటం కాకుండా ఆస్వాదించడంపై మనం దృష్టి సారించాలి. రిటైర్‌మెంట్‌ తరువాత ఆర్ధిక స్వేచ్ఛను కోరుకోవాలి. తద్వారా మన జీవితాలను డబ్బు నిర్ధేశించదు. టాటా ఏఐఏ లైఫ్‌ ఫార్చ్యూర్‌ గ్యారెంటీ పెన్షన్‌ ప్లాన్‌ అత్యద్భుతమైన ఆర్థిక సాధనంగా మన లక్ష్య సాధనలో నిలుస్తుంది. ఈ ప్లాన్‌ మా వినియోగదారులకు వారు రిటైర్‌ కాక ముందే తగినంతగా పొదుపు చేసుకునే అవకాశం అందిస్తుంది. జీతం ద్వారా అందుకునే ఆదాయం ఆగిన సమయంలో అది స్ధిరమైన ఆదాయం అందిస్తుంది’’ అని అన్నారు.