రియల్ ఎస్టేట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం: ఏఐ ప్రాపర్టీ ఎనలైజర్‌ను లాంచ్ చేసిన ల్యాండీడ్
భారతదేశపు ప్రముఖ ప్రాపర్టీ టెక్ స్టార్టప్ అయినటుంటి ల్యాండీడ్.. ప్రాపర్టీ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రాపర్టీ ఎనలైజర్ ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉంది ఈ ఫీచర్. రాబోయే రోజుల్లో ఈ ఏఐ ప్రాపర్టీ ఎనలైజర్ ఫీచర్.. భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను, ప్రాపర్టీ టైటిల్స్‌ను సరికొత్తగా పునర్నిర్వచించటానికి సిద్ధంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
AI ప్రాపర్టీ ఎనలైజర్.. ప్రాపర్టీ యొక్క పూర్తి పూర్వాపరాలను మొత్తం అందిస్తుంది. అంటే ప్రాపర్టీ ఉన్న దగ్గరనుంచి.. మొదటి ఓనర్ ఎవరు, రీసెంట్‌గా ఎవరు కొనుగోలు చేశారు, మధ్యలో జరిగిన లావాదేవలు అన్నింటికి సమగ్రంగా అందిస్తుంది. ఇది స్పష్టమైన, సంక్షిప్త శీర్షిక ప్రవాహాన్ని సమర్ధవంతంగా అందిస్తుంది. దీనిద్వారా ఆస్తి గురించి కొనుగోలు దారునికి స్పష్టమైన అవగాహన వస్తుంది. భారతీయ ఆస్తి పత్రాలకు సంబంధించి చట్టబద్ధమైన అంశాలన్నింటిని మేళవించి, దానికి సంబంధించిన వ్యవహారాలను క్షుణ్నంగా అందించేగా ఈ ఏఐ ప్రాపర్టీ ఎనలైజర్ ప్రాజెక్టుని రూపొందించారు.
ఈ సరికొత్త ప్రాపర్టీ ఎనలైజర్ ఫీచర్ ల్యాండీడ్ ద్వారా మధ్యవర్తులు, భూస్వాములు, భూ యజమానులు ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలను కూలంకుషంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ల్యాండీడ్ ద్వారా వినియోగదారులు కేవలం నిముషాల వ్యవధిలోనే ఈసీ సర్టిఫికెట్లు, 7/12 రికార్డులు, హక్కుల రికార్డులు (RoR) సహా లాంటి వాటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందవచ్చు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఏఐ ఎనలైజర్ ఇప్పుడున్న సౌకర్యాలను మరింత సులభతరం చేస్తుంది. డాక్యుమెంట్ విశ్లేషణను ఆటోమేటిక్ గా చేస్తుంది. అంతేకాకుండా అందులో ఉన్న వివరాలు, తప్పొప్పులు, చేసుకోవాల్సిన మార్పులను కూడా సూచిస్తుంది. ఈ అద్భుతమైన ఫీచర్ వినియోగదారులకు చాలా కష్టమైన ఆస్తి పత్రాలను కూడా సులభంగా పొందేలా చేస్తుంది. అన్నింటికి మించి సమయాన్ని చాలా బాగా ఆదా చేస్తుంది.
ఈ సందర్భంగా ల్యాండీడ్ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీ సంజయ్ మండవ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... "భారతదేశపు మొట్టమొదటి ఏఐ ప్రాపర్టీ ఎనలైజర్ ల్యాండీడ్‌ను పరిచయం చేయడం పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది రియల్ ఎస్టేట్‌లో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతుంది. రియల్ ఎస్టేట్ రంగానికి సరికొత్త సాంకేతిక హంగులు అద్దాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనం. దీనిద్వారా వినియోగదారులకు రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన తాజా సమాచారం అందుతుంది. తద్వారా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంతో కాన్ఫిడెన్స్‌గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అని అన్నారు ఆయన.
వినియోగదారులు అందించిన సలహాలు, విలువైన సూచనల ఆధారంగా ఈ ఫీచర్ ను మరింత మెరుగ్గా, వినియోగించే ప్రతీ ఒక్కరికీ అద్భుతంగా ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేని సాంకేతికతో కూడిన ప్రాపర్టీ టైటిల్ మేనేజ్మెంట్ సేవలను ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఏఐ ప్రాపర్టీ ఎనలైజర్ గురించి, రియల్ ఎస్టేట్ మార్కెట్ పైన అది అందిస్తున్న సమగ్ర సమాచారం గురించి వినియోగదారులు తమ ఫీడ్ బ్యాక్ ద్వారా కూడా తెలియచేయవచ్చు.