బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2024 (08:51 IST)

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం.. నోట్లో విద్యుత్ పైర్లు పెట్టి చంపేసిన భర్త... ఎక్కడ?

murder
తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో 52 యేళ్ల భార్యను 60 యేళ్ల భర్త నోట్లో విద్యుత్ వైర్లు పెట్టి చంపేశాడు. భార్య నిద్రిస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలో జరిగింది. మృతుడు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హరిద్వార్‌కు చెందిన హమీద్ (60) తన కుటుంబంతో కలిసి మంగ్‌లౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాడు. ఇంట్లో భార్య ఖాతూన్ (52), కుమారుడు మహ్మద్ నదీం, కుమార్తె కలిసివుంటున్నారు. అయితే, తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను భర్త అనుమానించసాగాడు. ఈ అంశంపై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఆమెను అంతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. 
 
తన పథకంలో భాగంగా, శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో నిద్రిస్తున్న భార్య నోట్లో విద్యుత్ వైర్లు పెట్టాడు. దీంతో ఆమెకు కరెంట్ షాక్‌తో ప్రాణాలు విడిచింది. తన తల్లి మృతిపై కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. పరారీలో ఉన్న హమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ జరుపుతున్నారు.