బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (22:46 IST)

జాతర జరుగుతోంది.. భార్యను బలి ఇచ్చిన భర్త

crime
గ్రామ దేవత జాతర నేపథ్యంలో పట్టణంలో అందరూ జాతర జరుపుకుంటారు. ఇక్కడ ఉదయం నుంచి మద్యం మత్తులో ఉన్న ఓ భర్త బయట నానా హంగామా చేశాడు. అదే మద్యం మత్తులో వచ్చి ఇంట్లో ఉన్న అతని భార్యపై దాడి చేసి హత్య చేశాడు. 
 
ఊర్లో అందరూ గ్రామ దేవతకు కోళ్లు, పొటేళ్లు బలి ఇస్తే ఇక్కడ ఓ భర్త అతని భార్యను గ్రామ దేవతకు బలి ఇవ్వడం కలకలం రేపింది. భర్త దాడి చెయ్యడంతో అతని భార్య గట్టిగా కేకలు వేసింది. డ్రమ్స్ సౌండ్స్, పలకల సౌండ్‌కు ఆ మహిళ చేస్తున్న ఆర్తనాదాలు చుట్టుపక్కల వాళ్లకు ఏమాత్రం వినపడలేదు. 
 
చెవిలో రక్తస్రావం కావడంతో భార్య కుప్పకూలింది. తలపై, చెవిపై బలమైన దెబ్బ తగిలి ఆమె మృతి చెందిన ఘటన కర్ణాటకలోని దావణగెరె తాలూకా శిరంగొండనహళ్లిలో చోటుచేసుకుంది. అర్పితా (24) అనే మహిళ ఆమె భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. హనమంత (28) అనే యువకుడు అతని భార్యను హత్య చేశాడని పోలీసులు తెలిపారు.