బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (10:17 IST)

నా మొగుడికి 500 మంది మహిళలతో అక్రమ సంబంధం : కోర్టుకెక్కిన మహిళ

romance
తన భర్తకు వ్యతిరేకంగా ఓ మహిళ కోర్టుకెక్కింది. తన భర్తకు ఏకంగా 500 మంది మహిళలతో అక్రమ సంబంధం ఉందంటూ ఆమె మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ వివరాలను పరిశీలిస్తే, తంజావూరుకు చెందింన ఆర్తి అనే మహిళ మదురై హైకోర్టు బెంచ్‌లో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో... 
 
తనకు వివేక్ రాజ్ అనే వ్యక్తితో వివాహమైంది. తామిద్దరం కలిసి జీవిస్తున్నాం. అయితే, ఇటీవల తన భర్త మొబైల్ ఫోనును చూడగా, అందులో పలు అసభ్యకర వీడియోలు, స్క్రీన్ షాట్‌లు, అసభ్యకర ఫోటోలు ఉన్నాయి. దాదాపు 500 నుంచి 1000 వరకు అసభ్యకర్ వీడియోలు ఉన్నాయి. ఈ విషయంపై భర్త, అత్తమామలను నిలదీయగా, వారు ఎవరికీ చెప్పొద్దంటూ తనను బెదిరించారు. 
 
పైగా, తాను ఇపుడు నెలల గర్భంతో ఉన్నట్టు చెప్పారు. అయినప్పటికీ తనపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీనిపై తంజావూర్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్ల తన భర్య వ్యవహారంపై సీబీసీఐడీ పోలీసులతో విచారణ జరిపించాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు... తంజావూరు ఎస్పీ, సీబీసీఐడీలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.