బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (08:42 IST)

కదులుతున్న బస్సులో నుంచి గర్భిణి భార్యను తోసేసిన భర్త!

crime
గర్భంతో ఉన్న భార్యను కట్టుకున్న భర్త బస్సులో నుంచి కిందకు తోసేయడంతో ఆమె మృతి చెందింది. ఈ అమానుష ఘటన తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని వెంబార్‌పట్టికి చెందిన వెళ్లయ్యన్ అనే వ్యక్తి కుమారుడు పాండియన్‌కు కల్‌వెలిపట్టికి చెందిన బాలమురుగన్ అనే వ్యక్తి కుమార్తె వళర్మతికి (18) గత ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. వళర్మతి ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి. సోమవారం రాత్రి భార్యాభర్తలు కల్‌వెలిపట్టి వెళ్లేందుకు గోపాల్‌పట్టి బస్టాండులో బస్సు ఎక్కారు. ఆ సమయంలో పాండియన్ మద్యం మత్తులో ఉండగా, భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 
 
ఆ తర్వాత ఇద్దరూ కలిసి బస్సు ఎక్కగా, కన్‌వాయిపట్టి సమీపంలో బస్సు వెళుతుండగా, అందులో నుంచి గర్భిణి అని కూడా చూడకుండా బస్సులో నుంచి కిందకు తోసేశాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పాండియన్‌ను అరెస్టు చేశారు.