గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (10:43 IST)

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో భర్త వెకిలి చేష్టలు.. చెంపలు వాయించిన భార్య...

man
హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో జరుగుతున్న ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు ఓ వివాహితుడు వచ్చాడు. ఈ ఎగ్జిబిషన్‌లో తీవ్రమైన రద్దీ ఉండటంతో ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తి... మహిళలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడ మఫ్టీలో ఉన్న మహిళా పోలీసులు.. అతగాడి చేష్టలను రికార్డు చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, సదరు భర్త.. భార్యను స్టేషన్‌కు పిలిపించి, భర్త చేసిన వెకిలి చేష్టల వీడియోను పోలీసులు చూపించారు. ఆ వీడియోను చూడగానే ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. అంతే.. పోలీసుల ముందే భర్తను పట్టుకుని చెంపలు వాయించేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నాంపల్లిలో నుమాయిష్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దీన్ని చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి రద్దీగా ఉండటంతో మహిళలను అసభ్యంగా తాకుతూ క్షణికానందం పొందసాగాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఈ ఘటనను మొత్తం రహస్యంగా రికార్డు చేశారు. ఆపే అతడిని అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
 
ఆ తర్వాత అతడి భార్యకు సమాచారం అందించి స్టేషన్‌కు పిలిపించారు. పిమ్మట అతడు చేసిన నిర్వాకాన్ని వివరించడంతో పాటు రికార్డు చేసిన వీడియోను ఆమెకు చూపించారు. అంతే.. అది చూసిన ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. అందరి ముందు భర్త చెంపలు వాయించేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.