హైదరాబాద్ అబిడ్స్ లాడ్జిలో వ్యభిచారం, 22 మందిని అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ నగరం అబిడ్స్ లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసారు. కోల్ కతా నుంచి యువతులను ఇక్కడికి తీసుకుని వచ్చి అబిడ్స్ లోని ప్రముఖ లాడ్జిలో గత కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో 16 మంది యువతులతో పాటు ఆరుగురు విటులు, ఇద్దరు ఆర్గనైజర్లు పట్టుబడ్డారు. వీరందరినీ కోర్టులో హాజరు పరచారు. అనంతరం వారిని చర్లపల్లి జైలుకి రిమాండుకి పంపినట్లు పోలీసులు తెలిపారు. కాగా పట్టుబడిన వారి నుంచి 22 సెల్ ఫోన్లు, రికార్డులను సీజ్ చేసి లాడ్జికి తాళం వేసారు పోలీసులు.