సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 జనవరి 2024 (22:12 IST)

మహిళలు తప్పకుండా సూర్య నమస్కారం చేయాలట..!

Surya Namaskar
Surya Namaskar
ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేయాలని పెద్దలు చెప్తుంటారు. దానిని విని మనం సూర్యుడిని చూసి నమస్కరిస్తుంటాం. అయితే ఇది సూర్య నమస్కారం కాదు. వరుసగా 12 యోగాసనాలు చేయడమే సూర్య నమస్కారం. 
 
ముఖ్యంగా మహిళలు ఈ ఆసనాలను చేయడం చాలా అవసరం. ఇది వారి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. సూర్య నమస్కారం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం.
 
12 ఆసనాలతో కూడిన సూర్య నమస్కారం ద్వారా అనేక శరీర సమస్యలను నివారించవచ్చు. దీనికి సూర్య నమస్కారాన్ని సరైన పద్ధతిలో చేయాలి. సూర్య నమస్కారంలో 12 ఆసనాలను పద్ధతిగా పూర్తి చేసేందుకు 34 నిమిషాలు పట్టవచ్చు. 
 
ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తే శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా వుంటుంది. వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. జీర్ణాశయంలోని రక్త ప్రసరణ మెరుగ్గా వుంటుంది. జీర్ణ సమస్యలు, అజీర్తి రుగ్మతలు తొలగిపోతాయి. మానసిక ఆరోగ్యం మెరుగుపడేందుకు సూర్య నమస్కారం తప్పకచేయాలి. 
 
సూర్య నమస్కారం ద్వారా నరాల బలహీనత వుండదు. నాడీ మండలం, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. సూర్య నమస్కారం ద్వారా మహిళల్లో థైరాయిడ్ సమస్య వుండదు. ఇంకా నెలసరి సమస్యలుండవు. కడుపు కండరాలను సూర్య నమస్కారం బలపరుస్తుంది. రుతుక్రమం నొప్పిని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.