1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఫిబ్రవరి 2024 (22:14 IST)

ఇమ్రాన్ ఖాన్‌ దంపతులకు ఏడేళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే?

imran khan
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో కేసులో జైలు శిక్ష పడింది. చట్ట వ్యతిరేక వివాహం చేసుకున్నారన్న కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో జరిగిన ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీల వివాహం చట్ట వ్యతిరేకం అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 
 
71 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌కు అధికారిక రహస్యాల లీకేజి కేసులో 10 ఏళ్లు, ప్రభుత్వ కానుకల అక్రమ అమ్మకం కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. తాజాగా చట్ట వ్యతిరేక వివాహం కేసులో ఇమ్రాన్‌తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు ఐదు లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా కూడా విధించారు.