ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (17:19 IST)

రామ్ చరణ్ మల్టీ టాలెంటెండ్ అంటున్న రాజలక్ష్మి

Rajalakshmi
Rajalakshmi
రామ్ చరణ్ హీరోగా హైదరాబాద్ లోని ఫిలిం సిటీలో గేమ్ ఛేంజర్ షూటింగ్ జరుగుతోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  అక్కడే మరో షూటింగ్ లో  సీనియర్ నటి రాజలక్మి పాల్గొంది. ఈ సందర్భంగా  గేమ్ ఛేంజర్ షూట్ గురించి అడుగగా, ఆమె ఇలా స్పందించింది.
 
గేమ్ ఛేంజర్ సూపర్ డూప్ హిట్ అవుతుంది. రామ్ చరణ్  కాంబినేషన్ లో బిందాస్ అనే హిందీ డబ్ మూవీ చేశాను. అందులో రెండో హీరోయిన్ మదర్ గా నటించా. అందులో.. అత్తా, నీ కూతురు కంటే అందంగా వున్నావ్.. అంటాడు. అది పెద్ద అప్లాజ్ గా అనిపించింది. ఇక షూటింగ్ టైంలో కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడతాడు. వెరీ టాలెంటెడ్. సూపర్ స్టార్ కొడుకు అయినా సపోర్ట్ లేకుండా ఓన్ గా టాలెంట్ తో మల్లీ టాలెంటెండ్ అని నిరూపించుకున్నాడు అని కితాబిచ్చారు.