శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (18:51 IST)

నా ప్రాణస్నేహితుడైన చరణ్ వల్లే ఇలా వున్నానన్న శర్వానంద్

Sharvanand, ram Charan
Sharvanand, ram Charan
సినిమారంగంలో ఎవరో ఒకరు బ్యాక్ బోన్ గా వుండాలి. అలాంటిది తనకు మెగాస్టార్ చిరంజీవి గారు, నా  నా ప్రాణస్నేహితుడైన చరణ్ వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నానని శర్వానంద్ తెలియజేస్తున్నారు. మంచు మనోజ్ చేపట్టిన ఓ టీవీ షోలో శర్వానంద్ చెప్పిన మాటలవి. 
 
మనోజ్ అడిగిన ప్రశ్నకు, చిరంజీవి గారు ఎంతో గొప్పవారో, అందర్నీ ఎలా ఎంకరేజ్ చేస్తారో ,ప్రేమ, అండగా నిలబడటం వుంటాయో అన్నీ చరణ్ లో ఉన్నాయి. ఈరోజు నేనిలా ఉన్నా అంటే నా ప్రాణస్నేహితుడైన చరణ్ వల్లే అలాంటి ఫ్రెండ్ దొరకడం అద్రుష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆ వెంటనే మనోజ్ కూడా నాకుకూడా బెస్ట్ ఫ్రెండ్ చరణ్ అంటూ తెలిపారు.
 
ఇటీవలే వివాహం చేసుకున్న శర్వానంద్, షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు. అయితే తాజాగా ఆయన ఓ సినిమా కూడా చేశాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ లో నిర్మించిన ఆ సినిమా షూట్ కూడా పూర్తయింది. మే లో సినిమా విడుదలకాబోతుంది.