శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 జులై 2017 (17:42 IST)

అక్కినేని నాగార్జున అసలు రాజకీయాల్లోకి రారు.. అదే నిజమైతే?: అమల అక్కినేని

వైకాపాలోకి అక్కినేని నాగార్జున చేరనున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన సతీమణి, నటీమణి అమల మాట్లాడుతూ.. నాగార్జునకు ఏ పార్టీలోనూ చేరాలనే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. అసలు ఆయన రాజకీయాల్లోకే రారని స్పష్టం

వైకాపాలోకి అక్కినేని నాగార్జున చేరనున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన సతీమణి, నటీమణి అమల మాట్లాడుతూ.. నాగార్జునకు ఏ పార్టీలోనూ చేరాలనే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు. అసలు ఆయన రాజకీయాల్లోకే రారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మవద్దని చెప్పిన అమల, ఒకవేళ ఆ వార్తే నిజమైతే, తామే స్వయంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, విషయాన్ని వెల్లడిస్తామన్నారు. 
 
రాజకీయాల్లోకి వస్తారనే విషయాన్ని రహస్యంగా దాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా, నాగార్జున వైఎస్ఆర్ సీపీలో చేరుతారని, 2019 ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నారని జోరుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాలకు అమల తన వ్యాఖ్యలతో క్లారిటీ ఇచ్చి చెక్ పెట్టారు.
 
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్‌తో నాగార్జున సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆధారంగా చూపిస్తూ.. అక్కినేని నాగార్జున వైకాపాలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది. దీనిపై అమల స్పందిస్తూ.. నాగార్జునకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. ఇకపోతే.. ప్రస్తుతం నాగార్జున తన కాబోయే కోడలు సమంతతో కలిసి.. రాజు గారి గది 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే.