ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 29 జూన్ 2017 (03:25 IST)

విడిపోయాక అమలాపాల్ మరీ తెలివి మీరిపోయిందా.. ధనుష్‌కే గాలమేసిందే?

ఇష్టపడి ప్రేమించి పెళ్లాడిన దర్శకుడు విజయ్‌తో సంబంధం స్వల్పకాలానికే తెగిపోవడంతో మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించి మంచి అవకాశాలను కొల్లగొడుతున్న అమలాపాల్ తాజాగా ధనుష్ విఐపి 2 మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే.. తాజాగా ఆ మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న అమలాపాల

తాను అనుకున్నది, చేయాల్సింది ఏమాత్రం మొహమాటం లేకుండా చేసేయడంలో అమలా పాల్‌ని మించినవారు లేరు.  ఇష్టపడి ప్రేమించి పెళ్లాడిన దర్శకుడు విజయ్‌తో సంబంధం స్వల్పకాలానికే తెగిపోవడంతో మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించి మంచి అవకాశాలను కొల్లగొడుతున్న అమలాపాల్ తాజాగా ధనుష్ విఐపి 2 మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే.. తాజాగా ఆ మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న అమలాపాల్ ... ధనుష్ అవకాశం ఇస్తే ఆయన భార్యనౌతా అంటూ మొహమాటం లేకుండా చెప్పేసింది. 
 
ధనుష్ నటించిన వీఐపీ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తెలుగులో రఘవరన్ బీటెక్‌గా రిలీజై ఇక్కడ కూడా మంచి టాక్‌ను సంపాదించింది. దీంతో ఈ చిత్రానికి కొనసాగింపుగా వీఐపి2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రఘవరన్ బీటెక్‌‌లో అమలాపాల్- ధనుష్ కెమెస్ట్రీ అద్భుతంగా పండటంతో రెండో భాగానికి కూడా అమలానే ఎంపికచేసుకున్నారు. ఒకవేళ వీఐపీ-3 నిర్మిస్తే అందులో ధనుష్‌కు మంచి భార్యగా ఉంటా అంటూ తన మనసులో కోరికను బయటపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
 
వీఐపీ-2లో సతాయించే భార్యగా నటిస్తున్నా. ఫస్ట్ పార్ట్‌లో ప్రియురాలిగా సెకండ్ పార్ట్‌లో హింసించే అర్ధాంగిగా నటిస్తున్నా.. ధనుష్ వీఐపి 3 తీస్తే అందులో కచ్చితంగా ధనుష్‌కు మంచి భార్యగా నటిస్తా అంటూ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో చమత్కరించింది అమలాపాల్. రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో అంటూ చమత్కరించిన అమలాపాల్‌ని చూసి అందరూ నోరెళ్లబెట్టారు.