బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (18:01 IST)

శరణ్య, శివానీ, సుహాస్ పోటీపడి నటించారు : హీరో అడివి శేష్

Ambajipet Marriage Band Pre Release
Ambajipet Marriage Band Pre Release
సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. హైదరాబాద్ లో హీరో అడివి శేష్ అతిథిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.
 
హీరో అడివి శేష్ మాట్లాడుతూ,  ప్రతి ఒక్కరూ డ్రీమర్స్. ఒక కల గని దాన్ని సాధించుకున్న వాళ్లు. ఆ సంతోషం వాళ్లలో కనిపిస్తోంది. సుహాస్ నాకు ఛాయ్ బిస్కట్ లో వీడియోలు చేస్తున్నప్పటి నుంచి తెలుసు. తను గొప్ప స్థాయికి వెళ్తాడని చెప్పగలను. ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులో చాలా అరుదుగా ఉంటారు. సుహాస్ నెక్ట్ ఏ స్థాయికి వెళ్తాడో ఊహించలేను. ఏదో ఒక రోజు తను నా ఈవెంట్ కు గెస్ట్ గా రావాలి. సుహాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ మూవీ ట్రైలర్ ను పది సార్లు చూశా. అంత బాగా నచ్చింది. శరణ్య, శివానీ , సుహాస్ పోటీపడి నటించారు. ఎవరూ తక్కువ కాదు అనిపించింది. గీతా ఆర్ట్స్ సంస్థలో నేను సినిమా చేయాలనుకుంటున్నా. త్వరలోనే ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. డైరెక్టర్ దుశ్యంత్, నిర్మాత ధీరజ్, బన్నీ వాస్ గారు, ఎస్ కేఎన్..ఇలా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఫిబ్రవరి 2న మనమంతా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా బ్యాండ్ మోగించాలి. అన్నారు.
 
నటి గాయత్రి భార్గవి మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాలో నటించడం మాకు మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. నవరసాలు ఉన్న సినిమా ఇది. ఆ గ్రామీణ వాతావరణంలో షూటింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేశాం. ఇలాంటి మూవీలో అవకాశం ఇచ్చిన దర్శకుడు దుశ్యంత్, ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో సుహాస్, శివాని, శరణ్య ఈ ముగ్గురు ఎంతో స్పెషల్  అని చెప్పాలి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" థియేటర్స్ లో చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు
 
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ - తెలుగు సినిమా రంగం గొప్ప టెక్నీషియన్స్ ను చూసింది. పాతాళభైరవి, శంకరాభరణం లాంటి గొప్ప సినిమాలను మన దర్శకులు తెరకెక్కించారు. కొంతకాలం తర్వాత తెలుగు సినిమా అంత గొప్ప సినిమాలు తెరకెక్కించలేకపోయిందనే అపవాదు తెచ్చుకుంది. మిగతా పరిశ్రమల్లోనూ కొత్త నీరు వస్తోంది. న్యూ టాలెంట్ చిత్ర పరిశ్రమను కంటెంట్ ఓరియెంటెడ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగులో ఎస్ కేఎన్, సాయి రాజేశ్, బన్నీ వాసు, ధీరజ్ అలాంటి ప్రయత్నం చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా. బేబి లాంటి మూవీని కేవలం కంటెంట్ ఓరియెంటెడ్ గా తీసి వారు సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా కూడా అలాంటి హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాలో కీ రోల్ చేశాను. ఇంత బలమైన క్యారెక్టర్ నేను చేసి మెప్పించగలను అని నమ్మిన మా డైరెక్టర్ దుశ్యంత్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. షూటింగ్ టైమ్ లో మా టీమ్ అంతా ఒక కాలేజ్ లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ చేసినంత అల్లరి చేశాం. అంత హ్యాపీగా షూటింగ్ జరిగింది. మూవీకి పర్పెక్ట్ టీమ్ కుదిరారు. డీవోపీ, మ్యూజిక్, సెట్స్..ప్రతి ఒక్కటీ అందంగా ఉంటాయి. మా సినిమా చూస్తే మేము మూవీ కోసం ఎంత కష్టపడ్డామో తెలుస్తుంది. ఫిబ్రవరి 2న మా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా చూసి మీ ప్రేమను మాపై వెయ్యింతలు పెంచుతారని ఆశిస్తున్నాం. అన్నారు.
 
హీరోయిన్ శివాని నాగరం మాట్లాడుతూ  - మా డైరెక్టర్ దుశ్యంత్ గారు ఒక అందమైన కథ రాసి, అందులో అంతకంటే అందమైన క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. ఈ కథలో నాకు లక్ష్మీ అనే క్యారెక్టర్ ఇచ్చి నన్ను యాక్టర్ గా మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఆయనకు ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు. సుహాస్ ఏమాత్రం ఈగో లేని యాక్టర్. తను ఎంతో సపోర్టివ్ గా ఉన్నాడు. తను నా ఫేవరేట్ కోస్టార్. సినిమా మొత్తం హ్యాపీగా షూటింగ్ చేశాం. నితిన్, శరణ్య...మిగతా ఆర్టిస్టులంతా అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. మా కాస్ట్ అండ్ క్రూ అంతా టీమ్ వర్క్ గా పనిచేశాం. ఫిబ్రవరి 2న మా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.
 
డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని మాట్లాడుతూ - మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన శేష్ గారికి థ్యాంక్స్. నేను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లవుతోంది. ఈ పదేళ్లలో డైరెక్టర్ ను అయ్యేందుకు కొన్ని శాక్రిపైజ్ లు చేయాల్సి వచ్చింది. అయినా ఇండస్ట్రీలోనే ఉన్నాను. వాటికి ఫలితం ఈ సినిమా సక్సెస్ ద్వారా దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన గీతా ఆర్ట్స్, బన్నీ వాసు, వెంకటేష్ మహా, ధీరజ్ గారికి థ్యాంక్స్. సుహాస్ లేకుంటే నేను డైరెక్టర్ గా ఈ స్టేజీ మీదకు వచ్చేందుకు ఇంకా ఎన్నేళ్లు పట్టేదో తెలియదు. థ్యాంక్స్ సుహాస్. అలాగే నా టీమ్ అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు చెబుతున్నా. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా టీజర్, ట్రైలర్ మీకు ఎంతగా నచ్చాయో...సినిమా అంతకంటే బాగుంటుంది. అన్నారు.
 
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగలినేని మాట్లాడుతూ, స్క్రిప్ట్ చేసిన విధానం ఎంతో సహజంగా అనిపించింది. డైలాగ్స్ తో సహా మాకు స్క్రిప్ట్ నెరేట్ చేశాడు. దుశ్యంత్ చేసిన వర్క్ రేపు థియేటర్స్ లో మీరు చూస్తారు. రెండేళ్లుగా ఈ సినిమా కోసమే దుశ్యంత్ పనిచేశాడు. ఈ సినిమా ఒక్కటీ రిలీజ్ అయితే అతని లైఫ్ మారిపోద్ది అని చెప్పేవాడిని. ఈ మూవీ మీ ముందుకు వచ్చేందుకు సుహాస్ మరో కారణం. అతను ఏడాది పాటు మరే సినిమా చేయకుండా ఈ మూవీ మీదే ఫోకస్ చేశాడు. సుహాస్ లేకుంటే ఈ సినిమా లేదు. ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి గట్స్ ఉండాలి. హీరోయిన్ శివాని, శరణ్య, నితిన్..డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ ప్రతి ఒక్కరూ తమ సొంత ప్రాజెక్ట్  లా వర్క్ చేసి మాతో ట్రావెల్ చేశారు. శేష్ గారికి థ్యాంక్స్. ఆయనను ఇష్టపడే వ్యక్తిని నేను. ఇవాళ శేష్ గారు మా కార్యక్రమానికి వచ్చి సపోర్ట్ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.
 
ప్రొడ్యూసర్ బన్నీ వాస్ మాట్లాడుతూ, ఈ సినిమాను డైరెక్టర్ దుశ్యంత్ ఎంతో రియలిస్టిక్ గా రూపొందించారు. మా ధీరజ్ ..తన పేరుతోనే బ్యానర్ పెట్టుకున్నాడంటే ఎంతో గట్స్ ఉండాలి. అతనికి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. మా సంస్థలో ఫస్ట్ మూవీ చేసిన హీరోయిన్స్ కు మంచి పేరొస్తుంది. శివానికి కూడా అలాంటి గుర్తింపు రావాలి. సుహాస్ సింప్లిసిటీ, జెన్యూనిటీ ఉన్న యాక్టర్. తను మా తండేల్ సినిమాలో ఓ కీ రోల్ చేయాల్సింది. హీరోగా చేస్తున్నావు మళ్లీ ఇటు అడుగువేయడం ఎందుకని ఆపాను. సుహాస్ ను చూస్తుంటే ఇరవై ఏళ్ల కింద మమ్మల్ని మేము చూసుకున్నట్లు ఉంటుంది. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా చూస్తున్నంత సేపు ఆడియెన్స్ ఆ ఊరికి వెళ్లినట్లు ఫీల్ అవుతారు. అన్నారు.
 
హీరో సుహాస్ మాట్లాడుతూ, నేను గీతా ఆర్ట్స్ లో హీరోగా చేస్తున్నానంటే మా పేరెంట్స్ నమ్మలేదు. నాకు అలాంటి అవకాశం ఇచ్చింది బన్నీ వాస్ గారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ఇప్పటిదాకా నేను చేసిన మూవీస్ లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు"కు బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చానని చెప్పగలను. అది దర్శకుడు దుశ్యంత్ ఇచ్చిన ప్రతి డీటెయిల్ వల్లే అలా నటించగలిగాను. నా కో స్టార్స్ గురించి ఈ సినిమా సక్సెస్ మీట్ లో తప్పకుండా మాట్లాడుతా. మీకు ఇష్టమైన సినిమాల లిస్టులో  "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీ ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా. ఫిబ్రవరి 1నే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. తప్పకుండా చూడండి. అన్నారు.