1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జులై 2016 (20:55 IST)

ఎయిరిండియా... అదో చెత్త ఎయిర్‌లైన్స్ : అమీషా పటేల్

ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిరిండియా సంస్థ ఓ చెత్త సంస్థ అంటూ తనలోని అక్కసును వెళ్లగక్కింది. అంతగా ఆమె విరుచుకుపడడానికి కారణం కూడా లేకపోలేదు

ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియాపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిరిండియా సంస్థ ఓ చెత్త సంస్థ అంటూ తనలోని అక్కసును వెళ్లగక్కింది. అంతగా ఆమె విరుచుకుపడడానికి కారణం కూడా లేకపోలేదు సుమా?
 
'భయ్యాజీ సూపర్ హిట్' అనే సినిమా షూటింగ్ కోసం సహ నటులు సన్నీడియోల్, అర్షద్ వార్సీ‌తో కలిసి బెనారస్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేసింది. అయితే చివరి నిమిషంలో ఆమె ఎకానమీ క్లాస్‌లో పర్యటించాల్సి వచ్చింది. 
 
దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన ఆమె ట్విట్టర్‌లో ఎయిరిండియాపై దుమ్మెత్తిపోసింది. అదో చెత్త సంస్థ అని ఆరోపించింది. ఇటీవలే తన జన్మదినాన్ని బ్యాంకాక్‌లో ఘనంగా జరుపుకున్న అమీషా మాడ్రిడ్‌లో జరిగిన ఇఫా వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.