గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 26 మే 2021 (16:44 IST)

నల్లమల లాంటి స్వచ్ఛమైన క్యారెక్టర్ లో అమిత్

Amit Tiwari
పలు సూపర్ హిట్ చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకున్నారు అమిత్ తివారీ. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ తో కుటుంబ ప్రేక్షకులందరికీ మరింత దగ్గరయ్యారీ నటుడు. అమిత్ తివారీ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం నల్లమల. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో ఇన్నోవేటివ్ స్టోరీ, స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రవి చరణ్. నల్లమల అటవీ ప్రాంతపు వాస్తవ ఘటనలు ఈ కథలో చూడబోతున్నాం. నల్లమల నుంచి హీరో అమిత్ తివారీ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఈ లుక్ లో అమిత్ ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. అతని కోపానికి, ఉద్వేగానికి కారణమేంటి అనేది సినిమాలో చూడాలి. నల్లమల ప్రాంతపు జీవన విధానం అమిత్ క్యారెక్టర్ రూపురేఖల్లో కనిపిస్తోంది.
 
ఈ సందర్భంగా దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ, నల్లమల భూమి బిడ్డ అమిత్ తివారీ. నిగూఢమైన నల్లమల అడవి లాంటిది అతని క్యారెక్టర్. దట్టమైన ఆ అటవీ ప్రాంతమంత స్వచ్ఛమైనది అతని వ్యక్తిత్వం. ప్రపంచాన్ని శాసించే ఆయుధం తయారీ కోసం నల్లమల వస్తాడు ఇరాన్ సైంటిస్ట్ నాజర్. అతని ఆయుధ తయారీకి కీలకమైన ఓ వస్తువు నల్లమలలో లభిస్తుంది. దీంతో ఆయుధ తయారీ పూర్తయ్యాక, పెద్ద సంఖ్యలో ఆ వస్తువు సేకరణ కోసం తిరిగి నల్లమల వస్తారు నాజర్. ఆ టైమ్ లో వారిని అమిత్ తివారీ ఎలా ఎదిరించాడు, అటవీ సంపదను ఎలా కాపాడాడు అనేది నల్లమలలో ఆసక్తికరంగా ఉంటుంది. అన్నారు.
 
భానుశ్రీ, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : శివ సర్వాణి, ఫైట్స్ : నబా, విఎఫ్ఎక్స్ : విజయ్ రాజ్, ఆర్ట్ : యాదగిరి, పి.ఆర్.వో : టి.మీడియా, సినిమాటోగ్రఫీ : వేణు మురళి, సంగీతం, పాటలు : పి.ఆర్, నిర్మాత : ఆర్.ఎమ్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రవి చరణ్