మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: సోమవారం, 27 జులై 2015 (19:05 IST)

మనవరాలి ప్రతిభకు ముగ్థుడైన అమితాబ్‌

తన మనవరాలు నవ్య నవేలి కనబర్చిన ప్రతిభకు అమితాబ్‌ ముగ్థుడయ్యాడు. పియానోలో ఆమె పలికించిన బాణీలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని 72 ఏళ్ళ నటుడు తన బ్లాగ్‌లో రాసుకున్నాడు. అమితాబ్‌ కుమార్తె అయిన శ్వేత కుమార్తె నవ్య. పియానోలో మ్యాజిక్‌ చేస్తుందనీ, స్వతహాగా అబ్బిన ప్రతిభను అభినందించలేకుండా ఉండలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఎక్కడా శిక్షణ లేకుండా తన మదిలో వచ్చిన ఆలోచనలకే తను కార్యరూపం చేయడం ఆనందాన్నిచ్చిందని తెలిపారు.