సంబంధిత వార్తలు
- Minor girl: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై భవనం పైనుంచి కిందకు తోసేశాడు..
- రైల్వే వంతెనను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. 15 మందికి గాయాలు.. మరో ముగ్గురు యాత్రికులు...?
- అన్నామలై ఇదు నమ్మ ఇయక్కమ్లో 10 గంటల్లో 10 లక్షల మంది సభ్యులు
- నటి త్రిషకు వేసవి గిఫ్ట్ హ్యాంపర్ పంపిన ఉపాసన.. ఏంటది?
- నైరుతి రుతుపవనాల రాక... రంగారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం
Sailaja Reddy: అమ్మా..నాకు ఆ అబ్బాయి కావాలి చిత్రం టీజర్ రిలీజ్
Ramasathynaranyan and chira team
ఆంధ్రప్రదేశ్ ఫిలిం డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్, ఫిలిం చాంబర్ ప్రధాన కార్యదర్శి కే అశోక్ కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు విఎన్ ఆదిత్య, సీనియర్ ఫిలిం జర్నలిస్టులు ప్రభు, సురేష్ కొండేటి, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ వేడుకలో పాల్గొన్నారు. "తొలి చిత్రంతోనే అన్ని శాఖల పట్ల అవగాహన పెంచుకున్న శైలుజా రెడ్డి సినిమా నిర్మాణ రంగంలోనూ అసాధారణ విజయం సాధించడం ఖాయమని" అతిథులు ఆకాంక్షించారు. "హీరోగా పరిచయమవుతున్న పవన్ మహావీర్ ను చూస్తుంటే... ఇది అతని తొలి చిత్రం అనిపించలేదని, అతనిలో అంత ఈజ్ ఉందని" అన్నారు. "లండన్ లో మెడిసిన్ చదువుతున్న పవన్ మహావీర్ టాలీవుడ్ కు దొరికిన మరో మంచి హీరో" అని కొనియాడారు.
చిత్రం అత్యద్భుతంగా రూపొందడంలో సహకరించిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు, టీజర్ విడుదలకు అతిథులుగా విచ్చేసిన చిత్ర ప్రముఖులకు నిర్మాత శైలజ రెడ్డి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతగా శైలజ రెడ్డి, హీరోగా పవన్ మహావీర్ లకు ఉజ్వల భవిష్యత్తు ఉందని దర్శకుడు శివాల ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల హీరోయిన్స్ వర్షిక, సుహానా, సుజాత, చైల్డ్ ఆర్టిస్ట్ సుప్రీతి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: వివారెడ్డి, ఫైట్స్; నందు, కొరియగ్రఫీ : భాను మాస్టర్ - మొయిన్ మాస్టర్, సంగీతం: సాయి కార్తీక్, ఛాయాగ్రహణం: మహేందర్.ఎం., ఎడిటర్: నందమూరి హరి, కో-డైరెక్టర్: రావుశ్రీ, నిర్మాత: జి. శైలజ రెడ్డి, స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శివాల ప్రభాకర్.
