శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 10 అక్టోబరు 2018 (14:24 IST)

మణిరత్నం చేతుల మీదుగా అనగనగా ఓ ప్రేమకథ పాట విడుదల(వీడియో)

సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం విరాజ్.జె అశ్విన్ హీరోగా పరిచయం అవుతూ 'అనగనగా ఓ ప్రేమకథ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. కె.సతీష్ కుమార్ సమర్పణలో టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్, రాధా బంగారు నటిస్తున్నారు.  సినిమా రంగంలో ప్రముఖ ఫైనాన్షియర్‌గా పేరుపొందిన నిర్మాత కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన 'లవ్ అంటే నేనేలే'  సాంగ్‌ను సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. చిత్రం యూనిట్‌కు అభినందనలు తెలిపారు. పాటకు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగున్నాయి. తమ చిత్రంలోని పాటను జీనియస్ దర్శకుడు మణిరత్నం విడుదల చేయటం పట్ల చిత్ర నిర్మాత సంతోషాన్ని వ్యక్తం చేసి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ గీతాన్ని మలేషియాలోని పలు సుందరమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంది.
 
ఈ గీతాన్ని శ్రీమణి రచించగా, దేవన్ ఆలపించారు. షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అక్టోబర్ నెలలో విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాము అని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ 
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు, కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి.

మణిరత్నం విడుదల చేసిన పాటను చూడండి వీడియోలో...