శకుంతల స్నేహితులుగా అనన్యనాగల్లా, అదితిబాలన్
Ananyanagalla and Aditibalan
పురాణంలో శాకుంతల కథ తెలిసిందే. కానీ చరిత్రలో ఉన్న ఓ విషయాన్ని పుస్తకాల్లో లేని విషయాన్ని దర్శకుడు గుణ శేఖర్ చెపుతున్నారు. సమంత ను శకుంతల పాత్రకు ఎంపికలోనే ఆయన మార్కులు కొట్టేశారు. గతంలో శాకుంతల కథ తో సినిమాలు వచ్చినా ఒకే కోణం ఉండేది. కానీ గుణ శేఖర్ చెప్పబోయే విషయం ఆశక్తీగా ఉంటుందని చిత్ర యూనిట్ చెపుతోంది. ఏప్రిల్ 14న సినిమా విడుదల కాబోతుంది.
ఇప్పటికే డబ్బింగ్ చెప్పిన సమంత సినిమా బాగుందని చెప్పింది. ఇక ఈరోజు శకుంతలకు అందమైన & ఆత్మీయ స్నేహితులు పాత్రలు రిలీవ్ చేశారు. ఒకరు కబుర్లు చెప్పేవారు, మరొకరు అమాయకంగా మరియు జిజ్ఞాస కలిగి ఉంటారు. ఇద్దరూ తమ ప్రియమైన శకుంతల పట్ల విధేయులుగా ఉన్నారు. ఈ ప్రేమ కథలో కీలకం వారే. ప్రియంవదగా అదితిబాలన్, అనసూయగా అనన్యనాగల్లా నటించారు.