1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (10:17 IST)

నాగ్ మార్కెటింగ్ తో సమ్మర్ బిజినెస్‌లో అఖిల్‌ ఏజెంట్‌ టాప్‌!

akil-nag-chaitu
akil-nag-chaitu
ఇప్పుడు రాబోయే వేసవి సినిమాలకు గిరాకీ. ఇప్పుడిప్పుడే విద్యార్థులకు పరీక్షలు రావడంతో పెద్ద సినిమాలు ఏమీ విడుదలకావడంలేదు. చిన్న సినిమాలు విడుదల జరుగుతున్నాయి. ఇక సమ్మర్‌కు ఈనెల 30న రాబోతున్న నాని దసరా చిత్రం ఐదు భాషల్లో విడుదలకాబోతుంది. అదేవిధంగా రవితేజ రావణాసుర సినిమాకూడా ఏప్రిల్‌లో సిద్ధంగా వుంది. ఈ మూడు సినిమాలు కూడా పాన్‌ ఇండియా సినిమాలు కావడం విశేషం.
 
అందుకే నిర్మాతలు బిజినెస్‌పరంగా కేర్‌ తీసుకున్నారు. అఖిల్‌ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకుడు కావడంతో ఏజెంట్‌ అనే రా సినిమా కావడంతో హాలీవుడ్‌ స్థాయిలో వుండేలా ట్రైలర్‌లో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమాను ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌లో అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. బిజినెస్‌ పరంగా కేవలం ఆంధ్రలోనే థియేట్రికల్‌ రైట్స్‌ 17కోట్లకు అమ్ముడయినట్లు ట్రేడ్‌వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇందులో నాగ్ మార్కెటింగ్ కూడా తోడయింది. 
 
ఏజెంట్‌ తర్వాత స్థానం నాని దసరా సినిమా 14 కోట్లకు చేరింది.  ఆ తర్వాత రావాణాసురకు దక్కింది ఈ సినిమా 11కోట్లకు అమ్ముడయిపోయింది. వీరితోపాటు పోటీగా రాబోతున్న సాయిధరమ్‌ తేజ్‌ విరూపాక్ష కూడా ఆంధ్రలో 10కోట్లకు అమ్ముడయినట్లు సమాచారం. ఇక ఇటీవలే సమంత తన సినిమా శాకుంతలం బాగుందని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఈ సినిమా మాత్రం 8కోట్ల బిజినెస్‌ అయిందని తెలుస్తోంది. సమ్మర్‌లో పెద్ద సినిమాల జోరు రాబోతుంది.