శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 మే 2023 (13:43 IST)

విమానం చిత్రంలో అన‌సూయ‌ గెటప్ పోస్ట‌ర్

Anasuya
Anasuya
స‌ముద్ర ఖ‌ని న‌టిస్తోన్న ద్విభాషా చిత్రం ‘విమానం’. శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేట్ వ‌ర్క్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. జూన్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్‌గా విడుద‌లైన గ్లింప్స్‌, సిన్నోడా ఓ సిన్నోడా సాంగ్ ప్రోమో సినిమాపై ఆస‌క్తిని పెంచాయి. ఈ క్ర‌మంలో  ఇప్ప‌టికే స‌ముద్ర ఖ‌ని పోషిస్తున్న వీర‌య్య పాత్ర‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేసిన చిత్ర ద‌ర్శ‌క నిర్మాతలు సినిమాలోని  ఇత‌ర పాత్ర‌ధారుల‌ను ప‌రిచయం చేయ‌ట‌మే కాకుండా ఆయా పాత్ర‌ల పేర్ల‌ను కూడా ఆడియెన్స్‌కు ఇంట్ర‌డ్యూస్ చేశారు. 
 
వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాగా.. సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో అల‌రించ‌బోతున్నారు. విమానం సినిమా ప్ర‌ధానంగా తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని తెలియ‌జేసే చిత్రం. మ‌రి ఈ తండ్రీ కొడుకుల‌కు సుమతి, రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్‌, కోటి పాత్ర‌ల‌కు ఉన్న లింకేంటి?  పాత్ర‌ల మ‌ధ్య ఉండే ఎమోష‌న‌ల్ క‌నెక్టివిటీ ఏంటి? వంటి విష‌యాలు తెలియాలంటే జూన్ 9 వ‌రకు ఆగాల్సిందే.