ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 2 ఏప్రియల్ 2020 (21:14 IST)

కన్నీంటి పర్యంతమైన రష్మి గౌతమ్, ఏమైంది?

అసలే కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజల్లో భయాందోళన. షూటింగ్ మొత్తం ఒకవైపు ఆగిపోయి సినీపరిశ్రమలో క్రిందిస్థాయి వారి జీవితాలన్నీ కుదేలవుతున్న పరిస్థితి. ఒక్క సినీపరిశ్రమ ఏంటి.. నిరుపేదల జీవితాల అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయి. అయితే కొంతమంది ప్రముఖులు దీనిపై ఇప్పటికే స్పందిస్తున్నారు. వారికి తోచినంత విరాళాలు ఇస్తున్నారు.
 
అయితే ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ మాత్రం తన ఆవేదనను ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకుంది. అది కూడా బోరున విలపిస్తూ. ఇంతకీ రష్మిక ఉన్నట్లుండి ఏడకడానికి కారణం కూడా ఉంది. కరోనా వైరస్‌తో చాలామంది జనం చనిపోతున్నారు.
 
ప్రపంచంలో ఇప్పటికే వేలమంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ అంటేనే జనం భయపడిపోవడమే కాదు.. చాలామంది ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళడం లేదు. రష్మి గౌతమ్ కూడా ప్రస్తుతం షూటింగ్ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నారు.
 
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన వీడియో కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. నేను కరోనా వైరస్ బాధితుల గురించి విన్నాను. ఆ వ్యాధికి మందులు లేవంట కదా. చనిపోతున్నారు. నాకు చాలా బాధగా ఉంది. మరికొంతమంది లాక్ డౌన్‌తో ఆకలితో అలమటిస్తున్నారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రజలు ధైర్యంగా ఉండాలి. ఆత్మస్థైర్యాన్ని ఎవరూ కోల్పోకండి అంటూ బోరున విలపిస్తూ రిక్వెస్ట్ చేసింది రష్మి.