గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (11:18 IST)

త్వరలో తల్లి కాబోతోన్న యాంకర్ సమీరా.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

Anchor Sameera
యాంకర్ సమీరా షరీఫ్ త్వరలో తల్లి కాబోతోంది. ఎందుకంటే గత 16 ఏళ్లుగా సీరియల్ హీరోయిన్‌గా ఎన్నో సీరియల్స్‌లో నటిస్తుంది సమీరా షరీఫ్. 2006లో ఆడపిల్ల అనే సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన సమీరా బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్‌తో ఎన్నో సీరియల్స్‌లో నటించింది. ముద్దుబిడ్డ, అభిషేకం, భార్యమణి, మూడు ముళ్ల బంధం వంటి ఎన్నో సీరియల్స్‌లో నటించింది.
 
అయితే మంగమ్మగారి మనవరాలు అనే సీరియల్‌లో నటించిన సమీరా ఆతర్వాత తమిళ్ బుల్లితెరపై అడుగుపెట్టింది. కొన్నేళ్లపాటు తెలుగు ఇండస్ట్రీకి దూరమైన సమీరా తమిళ్ సీరియళ్లతో ఫుల్ బిజీ అయ్యింది. ఆ సమయంలోనే సినీ నటి సన కుమారుడు సయ్యద్ అన్వర్ అహ్మద్‌తో ప్రేమలో పడింది. ఇంట్లోవాళ్ళని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది సమీరా. అయితే కొంతకాలం తెలుగు బుల్లితెరకు దూరమైనా సమీరా ఆ తర్వాత జీ తెలుగు అదిరింది అనే కామెడీ షోతో యాంకర్‌గా పరిచయం అయ్యింది. 
 
గతంలో వరుస పెట్టి సీరియళ్లలో నటించిన సమీరా షరీష్.. పెళ్లి తర్వాత మాత్రం కొంత స్పీడు తగ్గించేసింది. బుల్లితెరపై సందడి చేయకున్నా.. భర్త సహాయంతో యూట్యూబ్‌లో మాత్రం వీడియోలు చేస్తోంది. అలాగే, సెలెక్టివ్‌గా ప్రాజెక్టులను ఓకే చేస్తోంది. ఈ క్రమంలోనే కొన్నింటిని పట్టాలెక్కించేసింది కూడా. మరోవైపు.. అన్వర్ మాత్రం తమిళంలో వరుసగా సీరియళ్లు చేస్తున్నాడు.