గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (09:57 IST)

హరితేజకు పాపాయి పుట్టిందోచ్..! @It'sBabygirl

Hariteja
ప్రముఖ నటి, యాంకర్ హరితేజ సోమవారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తిరుపతికి చెందిన హరితేజ, టీవీ సీరియల్స్‌లో నటిస్తూ, యాంకర్‌గానూ రాణించింది. ఆపైన సినిమా నటిగా మారింది. ఈ యేడాది విడుదలైన 'అల్లుడు అదుర్స్, జాంబిరెడ్డి' చిత్రాలలోనూ హరితేజ నటించింది. 
 
అలాగే పలు చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రలను పోషిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 1లోనూ పార్టిసిపేట్ చేసిన హరితేజ వివాహం 2015లో దీపక్‌తో జరిగింది. గత యేడాది తన ప్రెగ్నెన్సీ గురించి హరితేజ సోషల్ మీడియాలో తెలిపింది. 
 
అప్పటి నుండీ ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్‌తో అభిమానులకు టచ్ లోనే ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 5న ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయాన్ని 'ఇట్స్ బేబీ గర్ల్' అంటూ హరితేజ తన భర్తతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాంతో నెటిజన్లు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు.