ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (18:09 IST)

అరుదైన కేసు.. తల్లి నుంచి బిడ్డకు యాంటీ బాడీలు.. బొడ్డు తాడులో?

అమెరికాలో కరోనా టీకా తీసుకున్న గర్భిణీ ఇటీవల ప్రసవించింది. దీంతో.. ఆ బిడ్డ శరీరంలో పుట్టుకతోనే కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కరోనా టీకా విషయంలో ఇటువంటి ఘటన జరగడం ప్రపంచంలోనే తొలిసారని వారు చెప్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. దక్షిణ ఫ్లోరిడాకు చెందిన సదరు మహిళ హెల్త్ కేర్ వర్కర్‌గా సేవలందిస్తుంటుంది. ఏడెనిమిది నెలల గర్భంతో ఉన్నప్పుడు ఆమె మోడర్నా రూపొందించిన కరోనా టీకా తీసుకున్నారు. దీంతో.. తల్లి నుంచి బిడ్డకు కరోనా యాంటీబాడీలు బదిలీ అవుతాయా లేదా అనే ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
 
అయితే.. టీకా తీసుకున్న మూడు వారాలకు ఆమె బిడ్డను ప్రసవించింది. అయితే.. కాన్పు తరువాత బొడ్డు తాడులో యాంటీబాడీలను గుర్తించినట్టు వైద్యులు డా. పాల్ గిల్బర్ట్, డా. ఛాడ్ రడ్నిక్ పేర్కొన్నారు. గర్భిణులకు ఇతర టీకాల ఇచ్చాక తల్లి నుంచి బిడ్డకు యాంటీబాడీలు చేరుతాయి. 
 
కరోనా టీకా విషయంలోనూ ఇదే విధంగా జరుగుతుందని తొలిసారి బయటపడిందని చెప్పారు. అయితే.. ఈ యాంటీబాడీలు శిశువుకు కరోనా నుంచి రక్షణ నిస్తాయో లేదో తెలుసుకునేందుకు మరింత అధ్యయనం అవసరమని వారు స్పష్టం చేశారు.