శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (17:56 IST)

అయ్యా.. ఆ సెక్స్ వీడియోలో ఉన్నది నేను కాదు.. కంటి పరీక్ష చేయించుకోండి: అనిరుధ్

తమిళ యంగ్ సంగీత దర్శకుడు అనిరుధ్.. వై దిస్ కొలవెరి సాంగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్యాలెంటెడ్ సంగీత దర్శకుడిని ఓ సెక్స్ వీడియో అభాసుపాలు చేసింది. సోషల్ మీడియాలో

తమిళ యంగ్ సంగీత దర్శకుడు అనిరుధ్.. వై దిస్ కొలవెరి సాంగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్యాలెంటెడ్ సంగీత దర్శకుడిని ఓ సెక్స్ వీడియో అభాసుపాలు చేసింది. సోషల్ మీడియాలో ఓ యువకుడు, యువతి శృంగార వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న యువకుడు అనిరుధ్ శరీర ఆకృతిని పోలి వుండటంతో.. అందరూ అతనేనని అనుకున్నారు. 
 
కానీ ఆ వీడియోలో ఉన్నది అనిరుధ్ కాదని సినీ వర్గాలు తేల్చినా, వీడియో మాత్రం వైరల్‌గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఉన్నది అనిరుధ్ అని.. సదరు యువతి ఓ టాప్ హీరోయిన్ అని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వీడియోపై అనిరుధ్ వివరణ ఇచ్చాడు. ఈ వీడియోలో ఉన్నవారు సినీ పరిశ్రమకు చెందిన వారు కాదన్నాడు. 
 
ముఖ్యంగా అనిరుధ్ ఆ వీడియోలో లేనే లేడని చెప్పాడు. అదో ఫేక్ వీడియో అని ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తన పేరుతో ఈ వీడియోను షేర్‌ చేస్తున్నవారు దయచేసి కంటి పరీక్ష చేయించుకోండని ట్వీట్‌ చేశాడు అనిరుధ్‌. కాగా చాలా చిన్న వయస్సులోనే టాప్ హీరోలకు సంగీతం అందించిన అనిరుధ్.. ప్రస్తుతం తెలుగులో పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిబోయే సినిమాకు కూడా సంగీత సమకూర్చనున్నాడు.