గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (17:25 IST)

లండన్‌లో జరుగుతున్న అను ఇమ్మాన్యుయేల్ మూవీ షూటింగ్

Anu Emmanuel
Anu Emmanuel
ఐదు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, My3 ఆర్ట్స్ బ్యానర్‌లపై లండన్ గణేష్, డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. సితార ఫిల్మ్స్ లిమిటెడ్ లైన్ ప్రొడక్షన్‌ని నిర్వహిస్తోంది.  
 
ఈ మూవీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. లండన్ లో అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్న మూవీ స్పైన్ చిల్లింగ్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది.
 
డైరెక్షన్‌తో పాటు టెక్నికల్ ఎక్సలెన్స్‌తో కూడుకున్న ఈ సినిమాకి ఆండ్రూ బాబు సినిమాటోగ్రఫీ కూడా నిర్వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. డిఆర్‌కె కిరణ్ ఆర్ట్ డైరెక్టర్ కాగా, రియల్ సతీష్ స్టంట్ డైరెక్టర్.
 
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నారు.
 
నటీనటులు: అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి, వైవా హర్ష, వెన్నెల కిషోర్, ఎస్ నివాసిని, షకలక శంకర్, మహేంద్ర, రెడిన్ కింగ్స్లీ తదితరులు.