యాక్షన్ ఎంటర్'టైనర్ కోసం శిక్షణలో రాజ్ దాసిరెడ్డి
మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కి చెప్పుకోదగ్గ విజయం సాధించిన “భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు” చిత్రంతో హీరోగా పరిచయమైన కథానాయకుడు "రాజ్ దాసిరెడ్డి" త్వరలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. అమెరికా, ఊటీ, హైదరాబాద్, వైజాగ్ తదితర ప్రదేశాల్లో రూపొందే ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ కథా చిత్రం కోసం దాసిరెడ్డి అమెరికాలో యాక్షన్ కు సంబంధించిన పలు అంశాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు.
భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు సినిమా తర్వాత రాజ్ దాసిరెడ్డికి తెలుగులో పలు ఆఫర్స్ వచ్చినప్పటికీ... అదే సమయంలో ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం రావడంతో అక్కడికి వెళ్ళాడు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అసాధారణ రీతిలో ఆలస్యమవుతుండడంతో... ఈ యాక్షన్ ఏంటర్టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రాజ్ దాసిరెడ్డి.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.